రత్నగిరికి తగ్గిన భక్తులు
అన్నవరం: సంక్రాంతి సందడి ముగియడంతో రత్నగిరికి భక్తుల రాక కాస్త తగ్గింది. ఏటా పుష్యమాసం ప్రారంభమయ్యాక సంక్రాంతి పండగల వరకూ సత్యదేవుని సన్నిధిలో రద్దీ ఉంటుంది. సంక్రాంతి సెలవులకు స్వస్థలాలకు వచ్చే వారు పనిలో పనిగా దేవాలయాలను కూడా దర్శించుకుంటారు. ఈ క్రమంలో సత్యదేవుని ఆలయానికి గత వారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి అనంతరం స్వస్థలాల నుంచి ప్రజలు తిరుగు ప్రయాణమవడంతో ప్రస్తుతం భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. ఈ నెల 30వ తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభం కానుండటంతో రద్దీ మళ్లీ పెరగనుంది.
సత్యదేవుని ఆలయాన్ని గురువారం 20 వేల మంది భక్తులు దర్శించి, పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. స్వామివారి వ్రతాలు 800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులు గురువారం ఎటువంటి స్వర్ణాభరణాలు లేకుండా నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీ హోమం నిర్వహిస్తారు.
కొనసాగుతున్న చికిత్స
కాకినాడ క్రైం: కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్లో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గురువారం తెల్లవారుజామున కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. శ్రీకాకుళానికి చెందిన చెల్లూరి కోటేశ్వరరావు, తలియ ధనలక్ష్మి, రేణుకలను జీజీహెచ్‌లో చేర్చారు. అయితే, రేణుకను ఆమె కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment