చేతి రాత.. భవిష్యత్ నిర్ణేత
● జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్
● పిఠాపురంలో జిల్లా స్థాయి చేతిరాత పోటీలు
పిఠాపురం: చేతి రాతే భవిష్యత్తును నిర్ణయిస్తుందని, తలరాతను మారుస్తుందని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) పిల్లి రమేష్ అన్నారు. జాతీయ చేతి రాత దినోత్సవం సందర్భంగా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి చేతి రాత పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ పోటీలను 3, 4, 5 తరగతుల విద్యార్థులను సబ్ జూనియర్స్‌గా, 6, 7 తరగతుల వారిని జూనియర్స్‌గా, 8, 9, 10 తరగతుల వారిని సీనియర్స్‌గా పరిగణించి నిర్వహించారు. మూడు విభాగాల్లో సుమారు 500 మంది విద్యార్థులు, 68 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీలను జిల్లా సైన్స్ అధికారి మైలపల్లి శ్రీనివాస్, జిల్లా చేతి రాత సమన్వయకర్త బొడ్డు అబ్రహం హాన్స్ పర్యవేక్షించారు. విద్యార్థులందరికీ బ్రౌజ్ సంస్థ బహుమతులు అందజేసింది. ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు యాహ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస వినీల్ తదితరులు పాల్గొన్నారు.
తొలి నాలుగు స్థానాల విజేతలు
సబ్ జూనియర్స్: బి.వెంకట్, ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పిఠాపురం. ఎ.శశికళ, జెడ్పీ హైస్కూల్, మల్లాం. కె.మహాలకి్‌ష్మ్, మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, సామర్లకోట. ఎస్.జ్యోతి కమల, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, ధర్మవరం.
జూనియర్స్: ఎస్.జోషిత, జెడ్పీ హైస్కూల్, తాళ్లరేవు. ఇ.అచ్చారత్నం, జెడ్పీ హైస్కూల్, శంఖవరం. పి.సత్య శ్రావణి, జెడ్పీ హైస్కూల్, పి.దొంతమూరు. వి.లక్ష్మీ గంగా దుర్గ, జెడ్పీ హైస్కూల్, మల్లాం.
సీనియర్స్: ఎం.నాగాంజలి, మున్సిపల్ బాలికల హైస్కూల్, పిఠాపురం. కె.సంధ్యారాణి, జెడ్పీ హైస్కూల్, పి.దొంతమూరు. పి.మౌనిక సాయి, జెడ్పీ బాలికల హైస్కూల్, తుని. బి.లిప్సిక, జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సామర్లకోట.
Comments
Please login to add a commentAdd a comment