సామర్లకోట: గిరిజనుల అభివృద్ధి కోనం రాజ్యాంగంలో ప్రత్యేకంగా పొందుపర్చిన పంచాయత్స్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డు ఏరియాస్ (పెసా) చట్టం, అటవీ హక్కుల చట్టంపై అవగాహన పెంచుకోవాలని స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) ప్రిన్సిపాల్ జె.వేణుగోపాల్ అన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 38 మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణను ఆయన గురువారం ఈటీసీలో ప్రారంభించారు. నాలుగు బ్యాచ్‌లలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ఎంపీడీఓ, ఈఓ పీఆర్డీ, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లోని అధికారులకు, గిరిజనులను వారి హక్కులపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఇ.కృష్ణమోహన్, పంచాయతీరాజ్ జేడీలు శ్రీదేవి, రమణ, డీడీ రామనాథం పాల్గొన్నారు. వివిధ అంశాలపై ఫ్యాకల్టీలు శిక్షణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment