లోటస్ ట్రావెల్స్‌కు రూ.1.97 లక్షల జరిమానా
ప్రత్తిపాడు: ఇటీవల ప్రత్తిపాడులో ప్రమాదానికి గురైన లోటస్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యానికి రవాణా అధికారులు రూ.1.97 లక్షల జరిమానా విధించారు. జాతీయ రహదారిపై పాదాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లోటస్ ట్రావెల్ బస్సు టైర్ పేలి, పంట పొలాల్లోకి దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ బస్సును కత్తిపూడి మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు. దీనికి రోడ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్సు కానీ లేవు. ఈ నేపథ్యంలో లోటస్ ట్రావెల్స్ యాజమాన్యానికి రూ.1.97 లక్షల జరిమానా విధించామని శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment