అంబాజీపేట: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు జీవ నియంత్రణ చర్యలపై జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికై నట్లు కేంద్ర అధిపతి డాక్టర్ ఎన్.బి.వి.చలపతిరావు గురువారం తెలిపారు. బెంగళూరుకు చెందిన ఐసీఏఆర్, ఎన్‌బీఏఐఆర్ సొసైటీ ఫర్ బయో కంట్రోల్ అడ్వాన్స్‌మెంట్ ఆధ్వర్యంలో డాక్టర్ చందీష్ ఆర్ బళ్లాల్ టీమ్‌కు అవార్డు ఫర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్‌టెన్ష్‌న్ వర్క్ ఇన్ బయాజికల్ కంట్రోల్ టీమ్ లభించిందన్నారు. వచ్చే నెల 25 నుంచి 27 వరకు జరగనున్న కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. కేంద్ర అధిపతి చలపతిరావుతో పాటు తెగుళ్ల విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.నీరజ, డాక్టర్ వి.గోవర్ధనరావు, ఉద్యాన విభాగ శాస్త్రవేత్త ఎ.కిరీటీ, కీటక విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ వి.అనూష, డాక్టర్ పి.సునీత అవార్డును అందుకుంటారన్నారు. కొబ్బరి, కోకోలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై జరిగిన పరిశోధనలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment