![ముద్రగడపై దాడి పిరికిపందల చర్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06jpt82-270118_mr-1738866839-0.jpg.webp?itok=JkYCIq08)
ముద్రగడపై దాడి పిరికిపందల చర్య
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, అమలాపురం ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కాపు జేఏసీ నాయకులు గురువారం కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనకు, ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్‌చార్జి ముద్రగడ గిరిబాబుకు సంఘీభావం తెలిపారు. తన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసమే అంకింతం చేసిన ముద్రగడను అవమానించడానికే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున్న కాపునాడు ఉద్యమం చేపట్టిన వ్యక్తిపై దాడి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావడంలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుతున్నారనే ఉద్దేశంతో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులపైనా, కార్యకర్తలపైనా పదేపదే దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించారని, ఇప్పటికై నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పందించి దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కాపులకు పెద్ద అన్నగా ఉంటానన్న పవన్ కాపుల కోసం పోరాడిన ముద్రగడ దాడి జరిగితే కనీసం ఖండించలేదని కాపు జేఏసీ నేతలు వాపోయారు. ముద్రగడకు సంఘీభావం తెలిపిన వారిలో చినిమిల్లి వెంకట్రావు, నల్ల విష్ణు, తోట రామకృష్ణ, దుర్గారావు, ఉమామహేశ్వరీ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం
మీడియాతో వైఎస్సార్‌సీపీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment