పోచారం ప్రధానకాలువ సైడ్‌వాల్స్‌కు కొనసాగుతున్న మరమ్మతు పనులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ గేట్ల సమీపంలో ప్రధాన కాలువకు ఇరువైపులా ధ్వంసమైన సైడ్‌వాల్స్‌కు మరమ్మతు పనులను చేపట్టారు. ‘సాక్షి’లో గతనెల 7న ‘కాలువలు అద్వాన్నం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు సంబంధించిన రూ.14లక్షల66 వేల నిధులతో పోచారం ప్రధానకాలువ సైడ్‌వాల్స్‌కు మరమ్మతు పనులను చేపట్టారు. ప్రాజెక్ట్ నుంచి విడుదలైన నీటిప్రవాహం తీవ్రతకు ప్రధానకాలువకు ఇరువైపులా సైడ్‌వాల్స్ కొంతమేర కూలిపోయాయి. ఈ క్రమంలో కూలిపోయిన ప్రధానకాలువ సైడ్‌వాల్స్‌కు మరమ్మతు పనులు చేపట్టేందుకు ఇటీవల నిధులను మంజూరు చేశారు. ప్రస్తుతం పోచారం ప్రధానకాలువ సైడ్‌వాల్స్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.
14 నుంచి
సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఖలీల్‌వాడి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ ఇంటిమేషన్ లెటర్లను ఆదివారం ఉదయం 8 గంట నుంచి ఈ నెల 13వ తేది రాత్రి 8 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రంలో ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని, ఇంటిమేషన్ లెటర్లను తప్పకుండా తీసుకురావాలని తెలిపారు. ఉమ్మడి ని జామాబాద్ జిల్లాలో సివిల్, ఏఆర్ పోస్టులు 640 ఉండగా వీటికి ఏప్రిల్ 30న 5,285 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment