ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

Published Tue, Apr 23 2024 8:15 AM

మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి - Sakshi

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి

మద్నూర్‌(జుక్కల్‌) : పార్లమెంట్‌ ఎన్నికలను అధికారులు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని జహీరాబాద్‌ పార్లమెంట్‌ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యలయంలో సోమవారం నియోజికవర్గ తహసీల్దార్లు, సెక్టోరియల్‌ అధికారులతో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి నట్లుగా ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఆయన సిబ్బందికి పేర్కొన్నారు. ఆయా మండలాల పరిధిలో ఉన్న తహసీల్దార్లు, సెక్టోరల్‌ అధికారులు కలిసి బూత్‌ లెవల్‌ అధికారులతో సమన్వ యం చేసుకోవాలని చెప్పారు. ఒక్కో సెక్టార్‌కు ఉ న్న పోలింగ్‌ స్టేషన్‌లలో సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణపై ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వ హించాలని విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదన్నారు. త హసీల్దార్లు ముజీబ్‌, సురేష్‌, వేణు, భిక్షపతి, రేణుక, దశరథం, క్రాంతికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ భరత్‌, ఎలక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ విజయ్‌, ఆర్‌ఐ శంకర్‌, ఎన్నికల సిబ్బంది పాల్గోన్నారు.

సమావేశంలో పాల్గొన్న ఎన్నికల అధికారులు
1/1

సమావేశంలో పాల్గొన్న ఎన్నికల అధికారులు

Advertisement
Advertisement