సర్కారు దవాఖానాకు సుస్తీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఉన్న 330 పడకల సర్కారు దవాఖానా(జీజీహెచ్)కు సమస్యలతో సుస్తీ చేసింది. సగానికిపైగా వైద్య పోస్టులు ఖాళీగా ఉండడంతో మెరుగైన సేవలు అందడం లేదు. ఆస్పత్రి భవనం సైతం ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కామారెడ్డి వైద్య కళాశాలతో పాటు జీజీహెచ్ లో 28 ప్రొఫెసర్, 30 అసోసియేట్ ప్రొఫెసర్, 59 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. కానీ ప్రస్తు తం 13 మంది ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్ర మే అందుబాటులో ఉన్నారు. ఇటీవల 17 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. మిగతా పోస్టు ల భర్తీకి రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా.. ఇక్కడ పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్ర ధానంగా గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజీ షియన్‌ల కొరత ఉంది. రాత్రి సమయంలో సీనియ ర్ వైద్యులు విధుల్లో ఉండడం లేదు. దీంతో ఆ స మయంలో ఆస్పత్రులకు వస్తున్న గర్భిణులు, రోగు లు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు అందుబాటులో లేని సందర్భాలలో డెలివరీలకోసం వచ్చే గర్భిణులను, క్షతగాత్రులను, ఇతర అత్యవసర కేసులను నిజామాబాద్‌కుగానీ, రాష్ట్ర రాజధానికి గాని రిఫర్ చేస్తున్నారు.
ఆస్పత్రిలో అన్నీ సమస్యలే..
జిల్లా ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆస్పత్రికి వచ్చే వారు ఇంటినుంచి గానీ, దుకాణాలలో కొనుక్కునిగాని నీటిని తాగుతున్నారు. బాత్‌రూంలు, మరుగుదొడ్లలోనూ నీటి సమస్య ఉంది. ఆస్పత్రి భవనం పెచ్చులూడుతుండడంతో రోగులు భయపడుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో వాహనాల పార్కింగ్‌కు సరిపడా స్థలం లేదు. దీంతో పార్కింగ్ కోసం వాహనదారుల మధ్య గొడవలూ జరుగుతున్నాయి. ఆస్పత్రి భవనంలో 43 విభాగాలున్నాయి. గదుల కొరతతో కొన్ని విభాగాలను వరండాలో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మార్చురి సమీపంలోనున్న స్థలంలో రోగుల రక్త నమూనాలు సేకరిస్తున్నారు. టీబీ ల్యాబ్ పక్కన గర్భిణులకు రక్త పరీక్షలు చేస్తున్నారు. మంచాలపైన చికిత్స పొందుతున్న రోగులకు బెడ్‌షీట్‌లు కూడా వేయడం లేరు. అధునాతన పరికరాలను వినియోగించకపోవడంతో మూలన పడ్డాయి. నెలలు గడుస్తున్నా మందుల కొరత సమస్య తీరడం లేదు. ఒకే గదిలో ఆయూష్‌కు సంబంధించిన మూడు అస్పత్రులు కొనసాగుతుండడం గమనార్హం. చికిత్స పొందుతున్న రోగులు, వారి వెంట ఉండే సహాయకులు భోజనాలు చేయడానికి ప్రత్యేక గదులు లేకపోవడంతో ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కూర్చొని భోజనాలు చేస్తున్నారు.
మెరుగైన సేవలు అందిస్తున్నాం
ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య పోస్టుల ఖాళీల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఆస్పత్రి కొంచం ఇరుకుగా ఉండడంతో కాస్త ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. కళాశాల నూతన భవనం నిర్మాణం పూర్తయితే సమస్యలు తీరుతాయి.
– ఫరీదా, ఇన్‌చార్జి సూపరింటెండెంట్,
జీజీహెచ్, కామారెడ్డి
కొన్ని విభాగాలను తరలిస్తేనే..
ఇరుకు భవనంలో ఉన్న కొన్ని విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే గదుల కొరత తీరే అవకాశాలున్నాయి. ప్రధానంగా డయాలసిస్, క్యాన్సర్ వార్డు, ఐసోలేషన్, మార్చురి, ఆయూ ష్, ఐసీటీసీ, ఏఆర్‌టీ లాంటి విభాగాలను దేవునిపల్లి వద్ద ఉన్న వైద్య కళాశాలకు తరలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాతా శిశు ఆస్పత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే గర్భిణులు, బాలింతలు, శిశువులకు మెరుగైన సేవలు అందుతాయి.
జీజీహెచ్‌లో సగం వైద్య
పోస్టులు ఖాళీ
సరైన సేవలందక ఇబ్బందిపడుతున్న రోగులు
ఇరుకై న భవనంతోనూ ఇక్కట్లు
Comments
Please login to add a commentAdd a comment