చలితో జాగ్రత్త..
కామారెడ్డి టౌన్: జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. చాలా ప్రాంతాలలో నాలుగైదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. చాలామంది జలుబు, దగ్గు, దమ్ము, చర్మ, ఊపిరితిత్తులు, కీళ్ల సమస్యలు, సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నారు. చలితో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినే ఆహారం, జీవనశైలి మార్చుకోవాలని జనరల్ ఫిజీషియన్ వెంకట్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు శ్రీనివాస్ సూచిస్తున్నారు. వారందిస్తున్న సూచనలు..
● చలికాలంలో చాలామంది నీటిని తక్కువగా తాగుతారు. ఇలా చేస్తే శరీరంలో నీటిశాతం తగ్గి జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లను తాగాలి.
● చలి గాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చి దురద పెడుతుంది. దీని నుంచి విముక్తి కోసం రాత్రిపూట చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లాంటివి రాసుకోవాలి. పెదవులు, ముఖం పగుళ్లు ఏర్పడకుండా లిప్‌బామ్, కోల్డ్‌క్రీం, వైట్ పెట్రోలియం జెల్లీ లాంటివి రాసుకోవాలి. వెచ్చదనం కోసం ఉన్ని దుస్తులు ధరించాలి.
● ఆస్తమాతో బాధపడే వారు చాలా
జాగ్రత్తగా ఉండాలి. శరీ
రానికి వేడి తగిలేలా చూసు కోవాలి. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం రోజూ ఆవిరి పట్టుకోవాలి.
● శిశువులను ఉదయం కాసేపు ఎండలో ఉంచాలి. వెచ్చని దుస్తులు వేయాలి.
● చలి కాలంలో సాధారణంగా వచ్చే దగ్గు, గొంతు
నొప్పిలాంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం పాలలో మిరియాల పొడిని కలిపి తాగాలి.
● కీళ్లు బిగుసుపోయి కదలికలు కష్టంగా మారతాయి. దీని నివారణ కోసం కీళ్లను తరచూ కదిలించాలి. ఏదో ఒక వ్యాయామం, అటూఇటూ తిరగడం చేయాలి.
● ఆహారాన్ని వేడిగా, తాజాగా తీసుకోవాలి.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చలి తీవ్రతకు మనుషులు, పశుపక్ష్యాదులే కాదు.. నారుమడీ వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో నారుమడులతో ఎదుగుదల లోపిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 2.50 లక్షల ఎకరాల్లో వరిపంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 4,745 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. 80 వేల ఎకరాల కోసం నారుమడులు పోసి ఉన్నారు. ఇంకా నారుమడులు పోస్తున్నారు. ప్రస్తుతం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో నారుమడుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా వ్యవసాయ అధికారి ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు..
● రాత్రి నారుమడిలో నిండా నీటిని ఉంచి ఉదయం నీటిని బయటకు పంపించాలి.
● నారుమడికి వేడిని అందించేందుకు గొర్రెలు, కోళ్ల ఎరువును చల్లితే ఫలితం ఉంటుంది. అలా గే భాస్వరాన్ని కూడా చల్లాలి.
● వీలైతే నారుమడికి చుట్టూరా కర్రలుగానీ, సలాకలు గా నీ ఏర్పాటు చేసి పైన కవర్ల తో క ప్పాలి. ఇలా చేస్తే నారుమడిపై చలి ప్రభావం తగ్గుతుంది.
● నారుమడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే నారుమడి పోసిన 22 రోజుల నుంచి 25 రోజులలోపు నాట్లు వేయాలి.
నారును కాపాడుకుందామిలా
‘శీత’ల సమస్యలు.. వెచ్చని ఉపశమనాలు
Comments
Please login to add a commentAdd a comment