ఆలయాల భూములు పదిలమేనా?
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాలు బడా రాంమందిర్, సారంగాపూర్ హనుమాన్ ఆలయం, నీలకంఠేశ్వరాలయం, జెండాబాలాజీ, ఖిల్లా రామాలయ (రఘునాథ ఆలయం) భూములు పదిలంగా ఉన్నాయా? లేక అన్యాక్రాంతమవుతున్నాయా? అనే దానిపై స్పష్టత లేకుండాపోతోందని ప్రజలు అంటున్నారు. నగరంలోని ప్రముఖ ఆలయాలకు అసలు భూములు ఎంత మేర ఉన్నాయి, పట్టాపాస్ పుస్తకాలు ఎవరి పేరుపై ఉన్నాయని ప్రశ్నిస్తుండగా, దేవాదాయశాఖకు సైతం పక్కా లెక్కలు తెలియడం లేదు. దేవుని మాన్యం భూములు ఇతరులు కబ్జా చేయకుండా అధికారులు చర్యలు ఎలా తీసుకుంటున్నరనేది ఎవరికీ తెలియని విషయంగా మిగిలిపోయింది. అలాగే భూములను కౌలు చేస్తున్న రైతులు ఆలయాలకు కౌలును సరిగా ఇస్తున్నారా? లేదా అనేది గోప్యంగా ఉండిపోతోంది. అలాగే గుట్టు చప్పుడు కాకుండా ఆలయాల భూములు బడా నాయకుల పేర్లపై అవుతున్నతున్నట్లు సమాచారం.
ఒక్క రోజు సర్వేతో సరి..
నగరంలోని బడారాం మందిరం భూములు న్యాల్‌కల్ రోడ్ ఆర్టీసీ బస్ డిపో వెనుక ప్రాంతంలో ఉండగా తూతూమంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఆలయ భూములను సర్వే చేసేందుకు కేవలం ఒక్కరోజే కేటాయించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అధికారులే ఒక్క రోజు సర్వే నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది.
రూ.కోట్ల విలువచేసే
భూములు అన్యాక్రాంతం
సర్వేలతో సరిపెడుతున్న అధికారులు
బాధ్యత ప్రభుత్వానిదే..
జిల్లాలో ముఖ్యంగా బాడా రాం మందిర్ ఆలయ భూముల సర్వే గత నాలుగు రోజుల క్రితం ఒక రోజు చేపట్టారు. మళ్లీ అధికారులు వస్తామని రాలేదు. మొత్తానికి నగరంలోని ప్రధాన ఆలయ భూములు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. సమస్యలు తలెత్తిన చోట సర్వేకు అనుమతులు తీసుకుంటున్నాం. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. – శ్రీరాం రవీందర్, జిల్లా ఇన్‌చార్జి కమిషనర్, దేవాదాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment