జాతీయ స్థాయి ఫిస్ట్‌బాల్‌కు ఎంపిక
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఫిస్ట్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జాతీయ సబ్ జూనియర్ ఫిస్ట్‌బాల్ పోటీలకు యాటకర్ల శివరామకృష్ణ, బదావత్ విష్ణువర్ధన్, విస్లావత్ కల్యాణి, ఈర్ల జగదీశ్వరి, సీనియర్ విభాగంలో బోండ్ల సలోని, బోండ్ల తేజ ఎంపికయ్యారు. బోయిన్‌పల్లిలోని కంటోన్మెంట్ గ్రౌండ్‌లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబర్చారన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు తమిళనాడులోని దిండిగల్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీడీ తెలిపారు. జాతీయ జట్టులో 12 మంది క్రీడాకారులకు గాను ఆరుగురు క్రీడాకారులు పడకల్ నుంచే ఎంపిక కావడం విశేషం. జాతీయ స్థాయికి ఎంపికై న క్రీడాకారులను రాష్ట్ర ఫిస్ట్‌బాల్ అ
అసోసియేషన్ వ్యవస్థాపకుడు జగన్‌మోహన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకట్, హెచ్‌ఎం సురేందర్‌రెడ్డి, జీపీ కార్యదర్శి భరత్‌కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పుప్పాల శ్రీనివాస్, ధను, సుచిత్, ఎల్లుల్ల ప్రసాద్, గణేశ్ అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు..
మాక్లూర్: మండలంలోని గుత్ప ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎం ఐశ్వర్య సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ కవిత బుధవారం తెలిపారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించి జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలత్లో విద్యార్థిని ఐశ్వర్య పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అలాగే పరుగుపందెం, అత్యపత్య పోటీల్లో కూడా గుత్ప పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారని అన్నారు.
సీఎం కప్ వాలీబాల్ పోటీల
అబ్జర్వర్‌గా మల్లేశ్‌గౌడ్
నిజామాబాద్‌నాగారం: సీఎం కప్ రాష్ట్ర వాలీబాల్ పోటీలకు అబ్జర్వర్‌గా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శిగా బొజ్జ మల్లేశ్‌గౌడ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు స్పో ర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఉత్వర్వులు విడుదలైనట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ హనుమంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఖమ్మం జిల్లా స్టేడియంలో జరగనున్న సీఎం కప్ రాష్ట్ర అండర్–18 వాలీబాల్ పోటీలకు పరిశీలకులుగా వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment