వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వాహనం ఢీకొని మహిళ ..
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూ పార్క్ వద్ద బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పల్లె సవిత (52) మహిళ గాయాలపాలై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సారంగాపూర్‌కు చెందిన పల్లె సవిత నెహ్రూ పార్క్ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగం, అజాగ్రత్తగా దూసుకొచ్చిన గూడ్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సవితను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
పరిస్థితి విషమించి మున్సిపల్ కార్మికుడు ..
రామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కామారెడ్డి మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన పసుపు రేవన్‌కుమార్(25) కామారెడ్డి మున్సిపాలిటీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీ ముగిసిన తరువాత ఇంటికి వెళ్తుండగా అతివేగంగా వెళ్తున్న ట్రాలీ ఆటో గ్రామ శివారులో బైకును ఢీకొట్టింది.ఈ ఘటనలో రేవన్‌కు గాయాలుకాగా, సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చికిత్స ని మిత్తం కామారెడ్డికి తరలించి అక్కడి నుంచి హై దరాబాద్‌కు తరలించారు. మృతుడి తాత పసుపు బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment