తైక్వాండో టోర్నీ లోగో ఆవిష్కరణ
నిజామాబాద్‌నాగారం: నగరంలోని గంగస్థాన్‌లో ఈ నెల 29న నిర్వహించే తైక్వాండో టోర్నమెంట్ లోగోను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. తైక్వాండో కోచ్ వినోద్‌నాయక్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి ముందు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, రూరల్ ఎస్సై ఎండీ ఆరిఫ్ చేతుల మీదుగా లోగోను కోచ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కోచ్‌లు, క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి
బోధన్: దివ్యాంగుల సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్) జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి బుధవారం డిమాండ్ చేశారు. దివ్యాంగులకు పెంచుతామన్న పింఛన్ ఇప్పటి వరకు చెల్లించలేదని, వారం రోజుల్లో చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నూతన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయాలన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని పేర్కొన్నారు.
ఆదివాసీలు
అన్ని రంగాల్లో రాణించాలి
పెర్కిట్: ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలని ఆదివాసి నాయక్‌పోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ భీమన్న మందిరం ప్రాంగణంలో బుధవారం ఆదివాసి నాయక్‌పోడ్ సంఘం సర్వసభ్య స మావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాంచందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసి పిల్లలు ఉన్నత చదువుల కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు. జాతి సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా ఉండి రాజకీయంగా అభివృద్ది చెందాలన్నారు. సమావేశంలో ఆదివాసి నాయక్‌పోడ్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్, కొసెడుగు రవి కుమార్, శానం పవన్ కుమార్, కొడ్రు నవీన్, ఐ రాజు, డి అంజయ్య, ఎం అశోక్, పూల నర్సయ్య, డి నరేందర్, టీసీ విఠల్, జి గంగాధర్, జి శ్రీనివాస్, ఎం ప్రవీణ్, ఎం సుదర్శన్, డి శ్రీనివాస్, ఎం సాగర్ పాల్గొన్నారు.
చర్చిలకు కేక్‌ల పంపిణీ
నవీపేట: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్ సౌజన్యంతో బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం మండలంలోని 31 గ్రామాల్లోని చర్చిలకు బుధవారం కేకులను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ఇండియన్ పెంతెకోస్త్ చర్చిలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ గ్రామాల చర్చి పాదర్‌లకు కేకులను అందజేశారు. కార్య క్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు న ర్సింగ్‌రావు, ప్రవీణ్‌కుమార్, లోకం నర్సయ్య, సూరిబాబు, గైని సతీశ్, చర్చి ఫాదర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment