సమస్యలు సీఎం దృష్టికి తీసుకు వెళ్తాం
నిజామాబాద్ అర్బన్: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఎమ్మెల్యేతో సమస్యలు చెబుతూ కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే వారిని ఓదారుస్తూ అధైర్యపడొద్దని మీ వెనకాల నేనున్నానని అన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి భూపేందర్, కోశాధికారి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, మహిళా అధ్యక్షురాలు గంగామణి, నాయకులు రాజు, రాణి, సుప్రజ, అఫ్సర్, గిరీశ్, రమేశ్, శ్రీనివాస్, నగేశ్‌గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment