‘హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి’
ఎల్లారెడ్డి రూరల్: ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖ్ వెంకటేశం సూచించారు. బుధవారం ఎల్లారెడ్డిలో విశ్వహిందూ పరిషత్ శిక్షణ వర్గ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామాలలో వీహెచ్‌పీ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, విశేష సంపర్క ప్రముఖ్ గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, కోశాధికారి డిష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment