మందు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
చాలా మంది యువత మద్యం, డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం నుంచైనా వీటికి దూరంగా ఉండాలి. మంచి ఆలోచనలతో ఉన్నతంగా ఎదిగేలా ముందుకు సాగాలి.
– అబ్దుల్ ముఖీద్, ఎంబీబీఎస్ సెకండియర్
ఆరోగ్యం చూసుకోవాలి
ప్రస్తుతం ఎవరికి ఎప్పుడు ఎలాంటి రో గం వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. చదువు ఎంత ముఖ్యమో.. ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. విద్యార్థులు చదువుతో పాటు నిత్యం ఆటలు ఆడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
– స్ఫూర్తి, ఎంబీబీఎస్ సెకండియర్
లక్ష్యంతో ముందుకెళ్లాలి
నేను ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలలి నిర్ణయించుకున్నాను. ఎంబీబీఎస్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం పెట్టుకోని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలి.
– అంజన, ఎంబీబీఎస్ ఫస్టియర్
దేశ అభివృద్ధికి పాటుపడాలి
భవిష్యత్‌లో మంచి స్థాయిలో రాణించాలంటే తమను తాము కొత్తగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. 2025లో దేశం మరింత వృద్ధిలోకి రావాలి.
– చంద్రకాంత్, పీజీ వైద్యవిద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment