కలెక్టర్‌ను కలిసిన ఏఎస్పీ చైతన్యరెడ్డి
కామారెడ్డి టౌన్: నూతనంగా బాధ్యతలు చేపట్టిన అదనపు ఎస్పీ బి చైతన్యరెడ్డి గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఏజీపీగా
లక్ష్మీనారాయణమూర్తి
బాన్సువాడ: బాన్సువాడ సివిల్ కోర్డులో అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్(ఏజీపీ)గా లక్ష్మీనారాయణ మూర్తిని ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను గురువారం జడ్జి భార్గవికి ఆయన అందజేశారు. బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో మూర్తికి అభినందనలు తెలిపారు. న్యాయవాదులు రమాకాంత్, ఖలీల్, దత్తాత్రిరావు, మొగులయ్య తదితరులు ఉన్నారు.
సీఎంను కలిసిన
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్(జుక్కల్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గురువారం జుబ్లిహిల్స్‌లోని ఆయన నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులకు నిధులు ఇవ్వాలని కోరారు. పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మహిళా ఉపాధ్యాయ దినోత్సవంపై హర్షం
కామారెడ్డి టౌన్: సావిత్రి బాయి పూలే జ యంతి సందర్భంగా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్‌కుమార్, తిరుపతి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్స వంగా జరపాలని రెండు దశాబ్దాలకుపైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. జీవో విడుదల చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నేటి నుంచి
రైల్వే గేట్ మూసివేత
బోధన్‌టౌన్: బోధన్ – మోస్రా రోడ్డులో హనుమాన్ టేక్డి కాలనీ వద్ద రైల్వేగేట్‌ను శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూసివేయనున్నట్లు స్టేషన్ మాస్టర్ రాము తెలిపా రు. మరమ్మతుల నేపథ్యంలో మూసివేస్తామని బోధన్ నుంచి బెల్లాల్, ఊట్‌పల్లి, మో స్రా వైపు వెళ్లే వాహనదారులు రాకాసీపేట్ మీదుగా, అటువైపు నుంచి వచ్చేవారు ఎరాజ్‌పల్లి మీదుగా రావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment