సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: సావిత్రి బాయి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు విద్య అందించడానికి సావిత్రి బాయి పూలే ఎంతగానో కృషి చేశారన్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో రాజు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వృద్ధాశ్రమ ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి
వృద్ధాశ్రమాన్ని ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్మించిన వృద్ధాశ్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. నీటి సరఫరాకు సంబంధించి బోరు నుంచి పైప్‌లైన్ పనులు పూర్తిచేయాలన్నారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ రాజన్న, మున్సిపల్ కమిషనర్ స్పందన, పంచాయతీరాజ్ ఈఈ దుర్గాప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ రమేష్, సీడీపీవో రోచిష్మ, తహసీల్దార్ జనార్దన్, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎంఆర్‌ను వేగవంతం చేయాలి
మాచారెడ్డి: సీఎంఆర్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట్ గ్రామంలోని గాయత్రి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును కలెక్టర్ తనిఖీ చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, సరఫరా చేయాల్సిన బియ్యం వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, తహసీల్దార్ లక్ష్మణ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment