‘ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’
కామారెడ్డి టౌన్: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం 25వ రోజు సమ్మె శిబిరాన్ని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆయన దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా చూడాలని కోరారు. సమ్మెకు జిల్లా ఉపాధ్యాయుల ఐక్యవేదిక అధ్యక్షుడు ప్రవీణ్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు లింగం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్, సంగయ్య, డీటీఎఫ్, టీపీఆర్‌టీయూ, పీఆర్‌టీయూ, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, అంబిర్ మనోహర్, కుశాల్, ఆకుల బాబు తదితరులు మద్దతు తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు క్యాతం సిద్ధిరాములు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి రాజేష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీహరి, సత్యం, యాదయ్య, అయ్యల సంతోష్ తదితరులు కోరారు. సమ్మెలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు సంపత్, రాములు, సంతోష్‌రెడ్డి, వనజ, కాళిదాస్, వీణ, మాధవి, శైలజ, సంధ్య, దినేష్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment