నారుకు ట్యాంకర్‌తో నీరు
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుద ల ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. నారు ఎండుతుండడంతో ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి అందిస్తున్నారు. గోపాల్‌పేటకు చెందిన లక్ష్మయ్య అనే రైతు పోచారం ప్రధాన కాలువ కింద వరి వేసేందుకు ఇప్పటికే నారు పోశాడు. అయితే ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేయకపోవడంతో నారు ఎండిపోతోంది. దీంతో ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. కాగా శనివారం ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీంతో తమ సాగునీటి కష్టాలు తీరుతాయని రైతు లక్ష్మయ్య ‘సాక్షి’తో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment