ముందుకు సాగని మరమ్మతులు!
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద గల జల విద్యుత్ కేంద్రంలో టర్బయిన్ల మరమ్మతు పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పరికరాలు దొరకకపోవడంతో పనులు ఆగిపోయాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా 1954లో హెడ్‌స్లూయిస్ వద్ద 15 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్ నుంచి మూడు టర్బయిన్లను తీసుకు వచ్చారు. ఒక్కొక్క టర్బయిన్ ద్వారా రోజుకు 5 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. 1974లో మూడో టర్బయిన్ పాడైంది. అప్పటి నుంచి రెండు టర్బయిన్ల ద్వారానే విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఆ రెండు టర్బయిన్లు అప్పుడప్పుడు సాంకేతిక సమస్య ఎదురవడంతో పాటు హైడ్రో ఎలక్రిసిటి పవర్‌కు ఇబ్బందులు తలెత్తున్నాయి. అయితే జల కేంద్రంలో టర్బయిన్ల ఆధునికీకరణతో పాటు ఆటోమెటిక్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా జల విద్యుదుత్పత్తికి పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జెన్‌కో అధికారులు ప్రతిపాదించారు. దీంతో జలవిద్యుత్ కేంద్రం ఆధునికీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో గతేడాది నుంచి కేంద్రం ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. టర్బయిన్ల మరమ్మతులు, కాలం చెల్లిన వైర్ల తొలగింపు, పరికరాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. అయితే టర్బయిన్లకు సంబంధిచిన పరికరాలు దేశంలో లభ్యం కాకపోవడంతో పనులకు ఆటంకం కల్గతుంది. ఇంగ్లాండ్ నుంచి పరికరాలు కొనుగోలు చేస్తే తప్పా టర్బయిన్ల మరమ్మతులు పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. పరికరాలు లేకపోవడంతో ఆరు నెలలుగా టర్బయిన్ల పనుల జాడ కరువైంది. కాగా పనుల్లో జాప్యానికి గల కారణాలను సంబంధిత అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
నిజాంసాగర్ జల విద్యుత్ కేంద్రం
పనులకు రూ.12 కోట్లు మంజూరు
పరికరాలు దొరకక నిలిచిన
టర్బయిన్ల రిపేర్లు
Comments
Please login to add a commentAdd a comment