సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నూతన సంవత్సరంలో వారాంతాల్లోనే పండుగలు ఎక్కువగా ఉన్నాయి. ఆదివారానికి ఒక రోజు ముందో, వెనకో పండుగలు వస్తే చాలు రెండు, మూడు రోజులు టూర్లు వెళ్లడానికి చాలా మంది ప్లాన్ వేసుకుంటారు. అలాంటి వారికి అనుకూలంగా ఈ ఏడాది పండుగలు వచ్చాయి.
● జనవరిలో మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి 12, 13, 14 తేదీల్లో అంటే ఆది, సోమ, మంగళవారాల్లో ఉంది. రెండో శనివారం 10వ తేదీ, ఆదివారం 11 కలిసి రావడంతో ఐదు రోజులు సెలవులు దొరుకుతాయి.
● మార్చి 14న (శుక్రవారం) హోలీ పండుగ వచ్చింది. దీంతో 15 శనివారం, 16 ఆదివారం కలిసివచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.
● మార్చి 30 ఆదివారం ఉగాది, 31న రంజాన్ సెలవులు వచ్చాయి.
● ఏప్రిల్ 5 (శనివారం) బాబూ జగ్జీవన్‌రాం జయంతి, 6 ఆదివారం కలిసి వచ్చాయి.
● ఏప్రిల్ 14 సోమవారం అంబేడ్కర్ జయంతి ఉంది.
● జూన్ 7 (శనివారం) బక్రీద్ పండుగ వచ్చింది.
● జూలై 21 సోమవారం బోనాల సెలవు.
● ఆగస్టు 9 శనివారం రాఖీ పౌర్ణమి కాగా, మరుసటి రోజు ఆదివారం కలిసి వస్తుంది.
● ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం రాగా, 16న శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి కలిసి వచ్చాయి. మరుసటి రోజు ఆదివారం కావడంతో మూడు రోజులు ఎటైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
● సెప్టెంబర్ 5 శుక్రవారం ఈద్ ఏ మిలాద్ పండుగ సెలవు. మరుసటి రోజు శనివారం సెలవు తీసుకుంటే ఆదివారంతో కలిసి మూడు రోజులు ఎంజాయ్ చేయొచ్చు.
● అక్టోబర్ 20 సోమవారం దీపావళి ఉంది.
● డిసెంబర్ మాసంలో 25 గురువారం, 26 శుక్రవారం రెండు రోజలు పాటు క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. శని, ఆదివారం కలుపుకుంటే నాలుగు రోజులు ట్రిప్ వెళ్లొచ్చు.
ఉద్యోగులకు అనుకూలం
Comments
Please login to add a commentAdd a comment