జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
కామారెడ్డి టౌన్: నూతన సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నూతన సంవత్సర సందర్భంగా విషెస్ తెలిపే కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో ఉద్యోగుల సహకారంతో మంచిపేరు సంపాదించామని, అదే స్ఫూర్తితో కొత్త ఏడాదిలో పని చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత, అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరుచుటలో ప్రతీ ఉద్యోగి భాగస్వాములు కావాలని సూచించారు. దాదాపు రూ.వెయ్యి కోట్లతో ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే రెండో స్థానం నిలిచామని, యాసంగిలో ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. గత సంవత్సరం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు చేపట్టి సౌకర్యాలు కల్పించామని గుర్తుచేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో డైట్ చార్జీలు ప్రభుత్వం పెంచిందని, దీంతో విద్యార్థులకు నాణ్యమైన శుభ్రమైన రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment