సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూంధాం
కామారెడ్డి టౌన్ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 20వ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద ఉద్యోగులు ధూంధాం నిర్వహించారు. రోడ్డుపైన ఉద్యోగులు కోలాటం ఆడారు. నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తమ పోరాటంలో ఏ రాజకీయ నాయకుల ప్రమేయం లేదన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, శైలజ, సంతోష్‌రెడ్డి, వనజ, మంగ, శ్రీవాణి, శ్రీను, కాళిదాసు, కళ్యాణ్, లింగం, దినేష్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ ఉద్యోగుల మద్దతు
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సీపీఎస్ ఎంప్లాయీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తదితరులు మద్దతు పలికారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తిర్మల్‌రెడ్డి సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.
కోలాటాలు, నృత్యంతో నిరసన
20వ రోజూ కొనసాగిన సమ్మె
Comments
Please login to add a commentAdd a comment