కోల్‌సిటీ(రామగుండం): రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న వివేక్ అనే ఎలక్ట్రీషియన్‌కు విద్యుదాఘాతంతో గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం రామగుండంలో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు ప్రకటించారు. ఆ సమయంలో మరమ్మతు చేపట్టాలని వివేక్ నిర్ణయించుకున్నాడు. ఆసుపత్రి ఆవరణలోని ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కి పని చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరిగి, విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
ఈ ఘటనలో అతను ట్రాన్స్‌ఫార్మర్ పైనుంచి కిందపడగా తల, కాలు, చెయ్యి, చాతిపైన బలమయైన గాయాలయ్యాయి. వివేక్ అపస్మారకస్థితిలో ఉండటంతో సిబ్బంది వెంటనే సీపీఆర్ చేసి, ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా.. విద్యుత్ సరఫరా రెండు గంటలపాటు ఉండదని ప్రకటించిన అధికారులు అకస్మాత్తుగా సరఫరా పునరుద్ధరించడం వల్లే ఈ ఘటన జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి విద్యుత్, ఆసుపత్రి అధికారులే బాధ్యత వహించాలని సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్ డిమాండ్ చేశారు. బాధితుడికి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్నారు.
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌కు గాయాలు
Published Mon, Apr 10 2023 1:38 AM | Last Updated on Mon, Apr 10 2023 9:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment