కరీంనగర్ టౌన్: సంక్రాంతి పండుగ అనేక ము ఖ్యమైన సంఘటనలతో ముడిపడి ఉందని, ప్రధానంగా సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశి లోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటున్నామని, ఈ రోజు నుంచే పగలు సమయం పెరిగి రాత్రి సమయం తగ్గుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు బూర్ల దక్షిణామూర్తి తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరీంనగర్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రెవెన్యూ గార్డెన్‌లో మకర సంక్రాంతి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వక్తగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రీ య స్వయంసేవక్ సంఘ్ ఏటా ఆరు ప్రధాన పండుగల పేరిట కార్యక్రమాలు చేపడుతుందని, ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయంలో లోతుగా పాతుకపోయిన ముఖ్యమైన వేడుకలన్నారు. సంక్రాంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యఅతిథిగా హాజరైన కరీంనగర్ గురుద్వార్ గ్రంధి సర్దార్ జగ్బీర్ సింగ్ ప్రసంగించారు. డాక్టర్ రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, హనుమండ్ల శ్రీనివాస్‌రెడ్డి, చామ మహేశ్వర్, బాలరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment