వివేకానందుడి ఆశయ సాధనకు కృషి చేయాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: స్వామి వివేకానందుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హా లులో ఆదివారం యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం నిర్వహించా రు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్ వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇన్‌చార్జి డీఆర్‌వో పవ న్ కుమార్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవో లు మహేశ్వర్, రమేశ్‌బాబు, డీవైఎస్‌వో శ్రీని వాస్‌గౌడ్, డీఆర్డీవో శ్రీధర్, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించండి
కరీంనగర్ అర్బన్: లబ్ధిదారుల ఎంపికలో అధి కారులు పారదర్శకంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈనెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించను న్న నేపథ్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సదరు పథకాలపై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజాపాలన గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలించే సర్వే పూర్తి చేసినందుకు అధికారులు అభినందించారు. 2.10 లక్షల ఇళ్ల సర్వే చేసి 66,271 దరఖాస్తులను ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. 100 దరఖాస్తులకు ఒక అధికారిని నియమించాలన్నారు.
పాల ఉత్పత్తిలో సుందరగిరి నంబర్‌వన్
చిగురుమామిడి: మండలంలోని సుందరగిరి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి కరీంనగర్ డెయిరీ నుంచి మొదటి బహుమతి లభించింది. ఆదివారం కరీంనగర్ డెయిరీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఫారెస్టు అధికారిణి బాలమణి చేతులమీదుగా సుందరగిరి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల తిరుపతి అవార్డు అందుకున్నారు. గ్రామం నుంచి నిత్యం 1800 లీటర్ల పాలసేకరణ జరుగుతోంది. దాదాపు 400మంది రైతులు పాలుపోస్తున్నారు. డెయిరీ పరిధిలో 1,230 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలుండగా సుందరగిరికి 11ఏళ్లుగా ప్రథమ బహుమతి వస్తుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. డెయిరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వర్‌రావు, డైరెక్టర్లు గండికోట చిన్నశ్రీనివాస్, బట్టు మల్లయ్య, శ్రీమూర్తి శ్రీనివాస్, పెసరి శ్రీనివాస్, పత్తెం రమేశ్, గందే రాజు, తాళ్లపల్లి సంపత్, కాశబోయిన రమేశ్, ఎనగందుల శారద, కార్యదర్శి మెడబోయిన శ్రీనివాస్, వెంకటేశ్, గంగరాజు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
హామీల అమలు కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం
కరీంనగర్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ముకుందలాల్ మిశ్రాభవన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమే శ్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి సాగర్, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, జిఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్, మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు ఆకోజు సదానందచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాసంఘాలన్ని ఐక్యంగా ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment