భోగి తెచ్చే భోగం
సంక్రాంతి పండుగొచ్చింది.. సంబరాలు తీసుకొచ్చింది.. ఎముకలు కొరికే చలికాలంలో పచ్చని ప్రకృతి పరవశించగా.. మంచు దుప్పటి తెరుచుకుంటూ సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. పంట చేతికొచ్చి.. రైతన్న ఇంట ధాన్యం రాశులు కళకళలాడగా.. ఊరంతా ఒక్కటైనట్లు, వాకిళ్లను కల్లాపి చల్లి.. రంగురంగుల ముగ్గులు వేసే పండగే సంక్రాంతి.. పండుగ వైభవం మూడు రోజుల పాటు ఉంటుంది. భోగితో మొదలయ్యే వేడుక కనుమతో ముగుస్తుంది. భోగి భోగభాగ్యాలను అందిస్తుందని నమ్మకం. వేకువజామున్నే వీధుల్లో భోగి మంటలు వేసి, పాతసామగ్రిని అందులో వేయడం ఆనవాయితీ. చిన్నారులకు భోగి పండ్లు.. పిండివంటలు.. రంగురంగుల ముగ్గులు.. ఇంటింటా పండుగ సందడే వేరు. నేడు భోగి వేడుకలు జరుపుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment