హక్కు సాధించాం | - | Sakshi
Sakshi News home page

హక్కు సాధించాం

Published Sat, Sep 21 2024 2:04 AM | Last Updated on Sat, Sep 21 2024 2:04 AM

హక్కు

తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా సాధించాం. తక్కువ మొత్తంలోనైనా కొత్తహక్కు పొందడం సంతోషంగా ఉంది. గతంలో కేఎల్‌ మహేంద్ర కార్మికులకు లాభాల వాటా సాధిస్తే ఈసారి కాంట్రాక్టు కార్మికులను కూడా లాభాల్లో భాగస్వామ్యులను చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకునేలా పోరాటం చేశాం.

– వాసిరెడ్డి సీతారామయ్య,

అధ్యక్షుడు, ఏఐటీయూసీ

వేతనాలపై సమీక్ష

మినిమం వేజ్‌బోర్డు చైర్మన్‌గా కాంట్రాక్టు కార్మికుల వేతనాలపై త్వరలోనే సమీక్షిస్తాం. రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు చొరవతోనే తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటాలో న్యాయం జరిగింది. మొదటిసారి హక్కు సాధించాం. మునుపెన్నడూ లేనంతగా ఈసారి అత్యధిక లాభాలు సాధించాం. కార్మికుల వాటా ఒకశాతం అదనంగా పెంచుకోగలిగాం.

– జనక్‌ప్రసాద్‌,

సెక్రటరీ జనరల్‌, ఐఎన్‌టీయూసీ

ఇదేస్ఫూర్తితో ముందుకు..

కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సమష్టి కృషి ఫలితమే మంచిలాభాలు సాధించాం. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి సంస్థను లాభాల దిశగా పయనింపజేయాలి. సమయపాలన పాటిస్తూ ప్రమాదాల్లేని సింగరేణి సంస్థగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేయాలి. ఈసారి కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించి రూ.5వేల చొప్పున బోనస్‌గా చెల్లిస్తాం.

– బలరాం, సీఎండీ, సింగరేణి

No comments yet. Be the first to comment!
Add a comment
హక్కు సాధించాం 
1
1/2

హక్కు సాధించాం

హక్కు సాధించాం 
2
2/2

హక్కు సాధించాం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement