కరీంనగర్సిటీ: సామాజికవేత్త, బీఎన్.రావు హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీఎన్.రావు పోటీ పరీక్షల పుస్తకాలను శాతవాహన యూనివర్సిటీ గ్రంథాలయానికి గురువారం అందజేశారు. వర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత సమయాన్ని వృథా చేసుకోకుండా చదువుకొని, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు. వర్సి టీ వీసీ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామన్నారు. వైద్య రంగంలో విశేష సేవలందించి, ఇప్పుడు విద్యార్థుల కోసం పుస్తకాలను అందించడం గొప్ప విషయమని డాక్టర్ బీఎన్.రావును అభినందించారు. రిజిస్ట్రార్ వరప్రసాద్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ హరికాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ జాఫర్ జరి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జయంతి, సోషల్ సైన్సెస్ డీన్ సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment