సిరిసిల్ల: గోదావరి జలాలను ఎస్సారెస్పీ, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని మధ్యమానేరుకు చేర్చారు. ఇక్కడి నుంచి జిల్లాలోని గంభీ రా వుపేట మండలం ఎగువమానేరుకు చేర్చాల్సి ఉంది. ఇందు కోసం ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగాయి. 16 ఏళ్ల కి త్రం అప్పటి సీఎం దివంగత నేత డాక్టర్ వైఎస్ రా జశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేసినా ఈ ప్రాజెక్టు పనులు స్వరాష్ట్రంలోనూ కొసముట్టలేదు. మధ్యమానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్ వరకు సొరంగంలో లైనింగ్ పనులు పూర్తి అయ్యాయి. గతేడాది రెండు పంపులతో ట్రయల్ రన్ ద్వారా ఒక్క టీఎంసీ నీటి ని ఎత్తిపోశారు. గోదావరి జలాలు అన్నపూర్ణ, రంగనాయకసాగర్ ద్వారా మల్లన్నసాగర్, కొండపోచమ్మకు చేరినా.. పక్కనే ఉన్న మల్కపేట, ఎగువ మానేరుకు చేరలేదు. ఎగువ మానేరు, కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు, ఎల్లారెడ్డిపేట సింగసముద్రం, జిల్లెల్ల నక్కవాగు జలాశయాలు నిండి వాగులు పారితే సాగు నీటి సమస్య తీరనుంది. అటు వైపు కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువుకు గోదావరి జలాలు చేరాలి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు తుది దశకు చేరాయి. అవి పూర్తి అయితే జిల్లాలో సాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment