పత్తికి దక్కని వేలం ధర
‘ఈ రైతు పేరు మాదరవేన కుమార్. పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలంలోని శానగొండ గ్రామం. ఒక ఎకరం సొంత భూమి ఉండగా, మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని, పత్తి సాగు చేశాడు. జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు మంగళవారం వ్యాన్‌లో మొదటిసారి 13 క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా క్వింటాల్‌కు రూ.6,850 ధర నిర్ణయించారు. రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీస్ మిల్లుకు తీసుకెళ్లి, దిగుమతి చేసే సమయంలో తేమశాతం, నాణ్యత లేదని రూ.100 తగ్గించి, క్వింటాల్‌కు రూ.6,750 ఇస్తామన్నారు. చేసేది లేక అతను పత్తిని అదే రేటు అమ్ముకొని, వెళ్లిపోయాడు. కేవలం ధరల్లో తేడాతోనే రూ.1,300 నష్టపోయానని, సీసీఐ కొనుగోలు చేస్తే రూ.7,500కు పైగా వచ్చేవని తెలిపాడు.’
‘ఈ రైతుల పేరు ఎం.శ్రీకాంత్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడిచెర్ల గ్రామం. ఇతను మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. గత సోమవారం జమ్మికుంట మార్కెట్‌కు వ్యాన్‌లో 13.65 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకువచ్చాడు. వేలంలో క్వింటాల్‌కు రూ.6,850 పలికింది. రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీస్ మిల్లులో దిగుమతి చేసే సమయంలో క్వింటాల్‌కు రూ.100 తగ్గించి, రూ.6,750 ధర నిర్ణయించారు. దూరం నుంచి రావడం వల్ల చేసేది లేక అదే రేటు విక్రయించానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఈ ఇద్దరు రైతుల పరిస్థితే కాదు.. మిల్లర్ల తీరుతో చాలామంది నష్టపోతున్నారు.’
Comments
Please login to add a commentAdd a comment