కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల ఖోఖో జట్ల ఎంపిక పోటీలను ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.మహేందర్‌రావు తెలిపారు. జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 9:30నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను వరంగల్ జిల్లాలో నిర్వహించే తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల ఖోఖో పోటీలకు ఎంపిక చేయనున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అంబేడ్కర్ స్టేడియంలో ఒరిజినల్ ఆధార్‌కార్డు, జిరాక్స్, ఫొటోతో హాజరుకావాలని సూచించారు.
ఆరుగురు పంచాయతీరాజ్ ఉద్యోగుల సస్పెన్షన్
రామగిరి(ముత్తారం): ముత్తారం మండలంలోని ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేస్తున్న సమయంలో సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారని గుర్తించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిష్టర్ పరిశీలించగా.. అనుమతి లేకుండా చాలా రోజులుగా సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారని తేలింది. సస్పెండైన వారిలో ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎండీ ఖాదర్ పాషా, జూనియర్ అసిస్టెంట్ వి.నరేశ్, కార్యాలయ సబార్డినేట్ ఎండీ ఫయాజ్, పంచాయతీ కార్యదర్శులు సురేందర్, ఫయాజ్, జైపాల్ ఉన్నారు.
హత్య కుట్రపై విచారణ చేయాలని ఫిర్యాదు
మంథని: తనను హత్య చేసేందుకు కుట్ర జరిగినట్లు కాటారం మాజీ జెడ్పీటీసీ, బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. ఈమేరకు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ 17న నారాయణరెడ్డి విడుదల చేసిన వీడియోలో తనను హత్య చేసేందుకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబు కుట్ర పన్నారనే అంశం ఉంద్నారు. వీడియోలో ఎప్పుడు కుట్ర చేశారని, కనుకునూరు ఎప్పుడు వెళ్లారనే విషయాలను వెల్లడించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కుట్రదారులు ఎవరనేది తెలుస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
వెల్గటూర్: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి న సంఘటన మండలకేంద్రంలో జరిగింది. పో లీసులు, బాధితుల కథనం మేరకు.. మండలకేంద్రానికి చెందిన లగిశెట్టి సత్తయ్య కుటుంబంతో కలిసి వేములవాడ, కొండగట్టు ఆలయాల దర్శనానికి వెళ్లి సోమవారం రాత్రి తిరిగి వచ్చాడు. తలుపు తెరిచి చూసేసరికి బీరువా త లుపు తీసి ఉంది. వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానంతో బీరువాలో చూ డగా 2 తులాల బంగారం, 40 తులాల వెండి పట్టగొలుసులు కనిపించలేదు. బాధితుల ఫి ర్యాదు మేరకు మంగళవారం ఉదయం పోలీ సులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment