సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి మరింత పెంచాలి
గోదావరిఖని: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తి మరింత పెంచాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్జీ–2 ఏరియాలో పర్యటించారు. ఆర్జీ–2 జీఎం వెంకటయ్య, ముఖ్య అధికారులతో సమావేశమై ఉత్పత్తి లక్ష్యాల సాధనపై దిశానిర్థేశం చేశారు. కృషిభవన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. యంత్రాల పనితీరు, ఉద్యోగుల యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిరంతర పర్యవేక్షణ కోసం ఉపయోగపడుతాయన్నారు. డైరెక్టర్ వెంట ప్రాజెక్టు అధికారి ఎస్.మధుసూదన్, ఎస్‌ఓటూ జీఎం రాముడు, ప్రాజెక్టు ఇంజినీర్ రాజాజీ, సర్వే అధికారి నర్సింహరావు, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment