మత్స్య సంపద పెంచడం మనందరి బాధ్యత
కరీంనగర్‌సిటీ: మత్స్య సంపదను పెంపొందించడం మనందరి బాధ్యత అని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఎస్సారార్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగ సారథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నేటి ప్రపంచ పోటీయుగంలో మత్స్యసంపదను పెంచేందుకు, స్థిరంగా బలపర్చేందుకు ఫిషరీస్ విద్యార్థులందరూ సరైన విజ్ఞానాన్ని పెంచుకోవాలని అన్నారు. జంతు శాస్త్ర విభాగ అధిపతి. సట్టు రమేశ్‌బాబు మాట్లాడుతూ మన ప్రాంత జలవనరులకు అనుగుణంగా చేపల ఉత్పత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతిలక్ష్మీ, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ కల్పన, రవీందర్‌రావు, సమత, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment