సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
హుజూరాబాద్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించి. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులు, బాలింతలతో వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, డాక్టర్ వెంకటరమణ, ఆర్‌ఎంవో సుధాకర్‌రావు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ ఉన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సైదాపూర్: వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం, సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని వెంకటరమణ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో రోగుల సంఖ్య, వైద్య సిబ్బంది పనితీరు, ప్రసవాలు ఎలా జరుగుతున్నాయనే ఆంశాలపై ఆరా తీశారు. సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి కృష్ణకుమార్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment