బీఎస్పీ బలోపేతానికి రాజకీయ శిక్షణ తరగతులు
కరీంనగర్: బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం దృష్ట్యా జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం అన్నారు. గురువారం రేకుర్తి అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో అస్తపురం మధు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎస్పీ కరీంనగర్ అసెంబ్లీ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జిలు మంద బాలయ్య, కళ్లెపల్లి రాజేందర్, జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి మహేశ్, అసెంబ్లీ ఇన్చార్జి బడుగు నరేశ్, కత్తుల హేమంత్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు రాజేశ్, చందు, దిలీప్, అనిల్, సోషల్ మీడియా ఇన్చార్జి మ్యాక సాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment