అవగాహనే లక్ష్యం.. పాటే మంత్రం
కరీంనగర్ అర్బన్: ప్రజా పాలన.. ప్రజా వజ్రోత్సవాల పేరిట ప్రభుత్వం ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను పాట రూపంలో వివరిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రధాన భూమిక పోషిస్తుండగా మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని ప్రధాన కూడళ్లలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. విశేష ఆదరణ పొందిన పథకాలపై కూడా పూర్తిస్థాయిలో ప్రచారం పొందలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో సాంస్కృతిక కళాకారులను ప్రజాపాలన కళాయాత్ర పేరిట కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. జిల్లాలో 23 మంది కళాకారులను రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు. దుర్గం మురళి, వడ్లకొండ అనిల్‌కుమార్‌లు బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. హుజూరాబాద్, కరీంనగర్ రెవెన్యూ డివిజన్‌లలో ప్రజా విజయోత్సవాలపై ఆట, పాటతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 19న ప్రారంభమైన కార్యక్రమం డిసెంబర్ 7వరకు షెడ్యూల్ రూపొందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణ మాఫీ, 200ల యూనిట్ల ఉచిత కరెంట్, యువతకు ఉద్యోగాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లు, స్వయం సహాయక సంఘాలకు నిధులు, గిరిజన శిక్షణ ఉపాధి కేంద్రాలు, రూ.500లకే సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, స్కిల్ యూనివర్శిటీ, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే వంటి పథకాలు వంటి కార్యక్రమాలపై పాటలు రూపొందించి ఆలపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
డిసెంబర్ 7వరకు కళాకారుల ఆటాపాట
జిల్లావ్యాప్తంగా
రెండు బృందాలతో ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment