కంగ్రాట్స్
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్
కరీంనగర్‌రూరల్: నగరంలోని రత్నం ఉన్నత పాఠశాలలో గురువారం సమగ్ర శిక్ష, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల విద్యార్ధులు మొత్తం 24 టీములుగా పాల్గొన్నారు. ప్రభుత్వ విభాగంలో మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్ధులు సుహానా, సనా తన్వీర్, నీష్ర ఫాతిమా, చామనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్ధులు అక్షర, లక్ష్మీభవాని, నిత్య, చింతకుంట పాఠశాల విద్యార్ధులు ఎండీ.ధూలే పాషా, ప్రశాంత్, సాత్వికలు జిల్లాస్ధాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రైవేటు విభాగంలో రత్నం పాఠశాల విద్యార్ధులు వర్షిణి, సాయిరమణ, తేజస్విని, అల్ఫోర్స్ పాఠశాల విద్యార్ధులు వర్షిత్‌రెడ్డి, సర్వజ్ఙ, శివకై లాష్‌రెడ్డి, రుక్మాపూర్ సైనిక స్కూల్ విద్యార్ధులు రిష్వంత్, హర్షిత్, తేజేశ్వర్‌లు ఎంపికయ్యారు. పాఠశాల స్థాయిలో పాల్గొని మండలస్థాయికి వచ్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, స్థాయికి ఎంపికై న వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి రామరాజు, జిల్లా కార్యదర్శి లక్ష్మారెడ్డి, కోశాధికారి అశో క్, రత్నం పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్,ఒలింపియా డ్ ఇన్‌చార్జి సమ్యోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ఇటీవల నూతనంగా నియామయమైన వి.బాలకృష్ణరెడ్డిని గురువారం కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ పి.రవీందర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
– కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment