అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కరీంనగర్ అర్బన్: అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పురుషోత్తం అన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో గురువారం నిర్వహించిన రైతు పండుగ దినోత్సవంలో మాట్లాడారు. 2024–25లో మార్కెట్ ప్రగతిని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సీసీఐ 23,967 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందని, దాని విలువ రూ.17.79కోట్లు ఉంటుందని వివరించారు. 21,464 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా రూ.4.82 కోట్లు విలువ ఉంటుందని అన్నారు. పండ్ల మార్కెట్‌లో 75,600 క్వింటాళ్ల పండ్ల విక్రయాలు, ప్రైవేట్ పత్తి కొనుగోలు 8241 క్వింటాళ్లు జరిగాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment