ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తితో సాక్ష్యం
● కోర్టు కానిస్టేబుల్ సస్పెన్షన్
జగిత్యాలక్రైం: కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కోర్టు కానిస్టేబుల్ కల్యాణ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ అశోక్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు విధుల్లో అలసత్వం వహించి ఒక కేసులో అవకతవకలకు పాల్పడ్డాడని వచ్చిన ఆరోపణల మేరకు విచారణ చేపట్టారు. అందులో నిజమని తేలడంతో సస్పెండ్ చేశారు. ఓ కేసులో ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తితో కోర్టులో సాక్ష్యం చెప్పించినందుకు కల్యాణ్‌పై రెండు రోజుల క్రితం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం గమనార్హం.
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
మేడిపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీ సులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూతల నరేశ్ కొన్ని రోజులుగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నరేశ్‌కు భార్య లత, కూతుళ్లు శాన్ని, జస్విక, కుమారుడు అక్షయ్ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె శ్యాంరాజు తెలిపారు.
అనారోగ్యంతో మరొకరు..
సిరిసిల్లక్రైం: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌కు చెందిన కర్ణాతం శ్రీనివాస్(46) బుధవారం ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. పవర్‌లూమ్ కార్మికుడిగా పనిచేసే శ్రీనివాస్ ఏడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ పనిచేయడం మానేశాడు. ఇతనికి రెండు వివాహాలు జరిగాయి. కానీ దాదాపు పదిహేనేళ్ల క్రితం విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి తల్లి లలితతోనే ఉంటున్నాడు. ఏడు నెలలుగా కడుపునొప్పి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మృతుని తల్లి లలిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.
గంజాయి సాగుచేసిన వ్యక్తి అరెస్ట్
ముత్తారం(మంథని): స్థానిక వడ్డెరకాలనీకి చెందిన రేపాల గట్టయ్య తన ఇంటి ఆవరణలో 12 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని, ఈమేరకు అతడిని బుధవారం అరెస్ట్ చేశామని మంథని సీఐ రాజు తెలిపారు. గంజాయి మొక్కల విలువ సుమారు రూ. 1,20,000 ఉంటుందని సీఐ వివరించారు. మంథని డివిజన్‌లో గంజాయిని విక్రయించినా, సాగు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేశ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment