రూ.3లక్షలు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి అప్పగింత
మెట్‌పల్లి: పట్టణానికి చెందిన హఫీజ్ అనే వ్యక్తి రూ.3లక్షలు పొగొట్టుకోగా.. వాటిని పోలీసులు తిరిగి అతడికి అప్పగించారు. ఈనెల 7న చావిడి రోడ్‌లో మారుతి మసాలా దుకాణం నిర్వహిస్తున్న షాపు యజమానులకు రూ.3లక్షలు దొరికాయి. ఆ సొమ్మును అదేరోజు వారు పోలీసులకు అప్పగించారు. స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసే హాఫీజ్ ఆ డబ్బులు తనవేనని పోలీసులకు ఆధారాలు చూపడంతో బుధవారం సీఐ నిరంజన్‌రెడ్డి వాటిని అతడికి అందించారు.
జానపద గాయకుడి మృతి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలంలోని చామనపల్లికి చెందిన యువ కవి, జానపద గాయకుడు రావుల పవన్(35) అనారోగ్యంతో మృతిచెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సామాజిక గీతా ల రచయితగా, జానపద గాయకుడిగా, తెలంగాణ రచయితల సంఘం సహాయ కార్యదర్శిగా పవన్ జిల్లాలో గుర్తింపు పొందాడు. తీవ్రమైన కడుపునొప్పితో సోమవారం ఆస్పత్రిలో చేరగా మంగళవారం శస్త్రచికిత్స చేశారు. అయితే, పరిస్ధితి విషమించడంతో బుధవారం మృతిచెందాడు. తల్లిదండ్రులు గతంలో మృతిచెందగా అవివాహితుడైన పవన్ తన ఇద్దరు అన్నలతో కలిసి ఉంటున్నాడు. అతని మృతదేహానికి మాజీ ఎంపీపీ టి.లక్ష్మయ్య, రచయితలు అన్నవరం దేవేందర్, కందుకూరి అంజయ్య, సీపీ కుమార్, కూకట్ల తిరుపతి, నడిమెట్ల రామయ్య, జనగాని యుగంధర్, వడ్డెపల్లి రాజేశం, బాలసాని కొమురయ్య, వైరాగ్యం ప్ర భాకర్, దామరకుంట శంకరయ్య, విలాసాగరం రవీందర్, పెనుగొండ బసవేశ్వర్ తదితరులు నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment