గ్లోబల్ హెల్త్‌లీడర్లపై వివక్ష వద్దు
● ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనాలు చెల్లించాలి ● ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి
సిరిసిల్లటౌన్: గ్లోబల్ హెల్త్‌లీడర్లుగా ప్రపంచ ఆరో గ్య సంస్థ కొనియాడిన ఆశావర్కర్లపై ప్రభుత్వం వి వక్ష చూపొద్దని ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అ ధ్యక్షురాలు జయలక్ష్మి కోరారు. ఆశావర్కర్ల హక్కు ల సాధన కోసం చేపట్టిన బస్సుజాత బుధవారం సిరిసిల్లకు చేరింది. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి పద్మశాలీ కల్యాణ భవనం వరకు ర్యాలీ తీశారు. బహిరంగసభలో జయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆశాల కు ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలని కోరారు. ఆశావర్కర్లకు పనిభారం తగ్గించాలని, అధికారుల వేఽధింపులు నిరోధించాలని, ప్రతి అంశంలో లక్ష్యం పెట్టి టార్చర్ పెట్టొద్దని కోరారు. ఎన్నికల మేని ఫెస్టోలో ఆశలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామన్నారు. ఆశవర్క ర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురా లు బదవేని మంజుల, నాయకులు ఆర్.నీలాదేవి, గంగమణి, ఆర్. సాధన, సునీత, పద్మ, బాలమణి, ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, మూషం రమేశ్, సూరం పద్మ, అన్నల్‌దాస్ గణేశ్, ఎలిగేటి రాజశేఖర్, గురజాల శ్రీధర్, భారతి, జయశీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment