భక్తజన మల్లన్న జాతర
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటలోగల దొంగ మల్లన్న స్వామి జాతర బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయమే ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారికి బోనాలు చేశారు. గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గుడోలు, ఢమరుకం వాయిద్యాల మధ్య స్వామవారికి పట్నాలు వేశారు. అర్చకులు కొల్లూరి రాజేందర్, రఘునందన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. టికెట్ల ద్వారా ఆలయానికి రూ.57,630 ఆదాయం సమకూరినట్లు ఫౌండర్ ట్రస్టీ శాంతయ్య, నిర్వహణ అధికారి విక్రమ్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, మాజీ సర్పంచ్ సిద్ధంకి నర్సయ్య, మాజీ ఎంపీటీసీ గోస్కల రాజన్న, విద్యా కమిటీ చైర్మన్ సిద్దంకి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment