కత్తులతో బెదిరించి.. బంగారు ఆభరణాలు చోరీ
ఇబ్రహీంపట్నం: దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు 14 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెంబేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాధిత కుటుం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని కొజన్ కొత్తూర్ గ్రామానికి చెందిన గోపిడి సంతోష్‌కుమార్ మూడురోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి, అరుణాచలం వెళ్లాడు. దర్శనం చేసుకొని తిరిగొస్తుండగా వనపర్తి జిల్లా పెంబేరు పోలీస్‌స్టేషన్ పరిధి తోమలపల్లి శివారులో ట్రక్ పార్కింగ్ వద్ద కారును నిలిపి కాసేపు నిద్రలోకి జారుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలను పగులగొట్టి కత్తులతో బెదిరించారు. అనంతరం సంతోష్ మెడలోని తులంన్నర బంగారు ఆభరణం, భార్య సరస్వతి మెడలోని నాలుగన్నర తూలాలు, తల్లి రజిని మెడలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సంతోష్‌తో పాటు మరో వ్యక్తి వారి దాడిలో గాయపడ్డారు. మహిళలకు సైతం గాయాలుకావడంతో మహబుబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపా రు. సంఘటన స్థలాన్ని వనపర్తి జిల్లా ఎస్పీ గిరీశ్వరరావు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేసి కేసునమోదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment