కొత్తగా మరో 9 రకాల సేవలు
కరీంనగర్‌రూరల్: గతంలో ప్రజలకు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మీసేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి కోసం, రెవెన్యూ సర్టిఫికెట్లు పొందడం, బిల్లుల చెల్లింపు, ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం తదితర పనులన్నీ ఈ కేంద్రాల ద్వారానే పూర్తవుతున్నాయి. ఇప్పటికే 350 రకాల సేవలను అందిస్తుండగా ఇటీవల కొత్తగా మరో 9 రకాల సేవలను ప్రభుత్వం మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 704 కేంద్రాల ద్వారా ప్రజలకు పలు సేవలందుతున్నాయి. కరీంనగర్‌లో 206, జగిత్యాలలో 224, పెద్దపల్లిలో 164, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 110 కేంద్రాలున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖకు చెందిన సేవలన్నీ మీ సేవ కేంద్రాల ద్వారానే జరుగుతున్నాయి. విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ, నివాస సర్టిఫికెట్లతోపాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోంది.
గతంలో మాన్యువల్ పద్ధతిలో జారీ
రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన సేవలను ఇటీవల ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థులు ఏదైనా కారణంతో మధ్యలో చదువు మానేసి, తర్వాత చదువుకునేందుకు గ్యాప్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. దీన్ని గతంలో తహసీల్దార్ కార్యాలయంలో మాన్యువల్ పద్ధతిలో జారీ చేయగా ప్రస్తుతం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పౌరుల పేరులో మార్పు చేసుకునే అవకాశం, లోకల్ క్యాండిడేట్, మైనార్టీ సర్టిఫికెట్, ధ్రువీకరణ పత్రం పున:జారీ, క్రిమీలేయర్, నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్లు, వయో వృద్ధుల నిర్వహణ కేసులు–పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నాయి. వన్యప్రాణుల దాడిలో మృతిచెందిన వ్యక్తులు, జంతువులకు సంబంధించి మంజూరీ చేసే పరిహారం, టింబర్ డిపోకు సంబంధించిన కొత్త లైసెన్స్‌తోపాటు రెన్యువల్ సేవలున్నాయి.
మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి..
ఉమ్మడి జిల్లాలో 704 సెంటర్లు
Comments
Please login to add a commentAdd a comment