పరీక్ష రాసేందుకు వెళ్తూ.. లారీని ఢీకొట్టిన విద్యార్థులు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): డిగ్రీ పరీక్ష రాసేందుకు వెళ్తూ ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి ప్రగతినగర్‌కు చెందిన వల్లెపు జ్యోతి–ఉప్పలయ్య దంపతుల చిన్నకుమారుడు వల్లెపు జాన్‌ప్రకాశ్, ఉప్పలయ్య తమ్ముడి కుమారుడు, జాన్‌ప్రకాశ్ క్లాస్‌మేట్ వల్లెపు కరుణాకర్ కలిసి పరీక్ష రాసేందుకు బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై సుల్తానాబాద్ వచ్చారు. మరో క్లాస్‌మేట్ సుల్తానాబాద్‌కు చెందిన కొయ్యడ భానును బైక్‌పై ఎక్కించుకొని కరీంనగర్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష రాసేందుకు బయలు దేరారు. వీరి వాహనం దుబ్బపల్లి వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీ ఒక్కసారిగా వెనుక్కి రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి దానిని ఢీ కొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న జాన్‌ప్రకాశ్, వెనుకాల కూర్చున్న భాను తీవ్రంగా గాయపడ్డారు. వీరికి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో కరీంనగర్‌కు అక్కడి నుంచి హైదారాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో కరుణాకర్ కూడా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురు ఓ ప్రైవేట్ కళాళాల డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. జాన్‌ప్రకాశ్ తల్లి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు.
ఎన్టీపీసీ గేట్ వద్ద మరొకరికి..
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ టెంపరరీ టౌ న్‌షిప్ గేట్ సమీపంలోని రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. నర్రాశాలపల్లెకు చెందిన శంకర్ తన ద్విచక్ర వాహనంపై ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు వైపు వస్తుండగా హైదరాబాద్‌కు చెందిన కారు అదే మార్గంలో వచ్చి ఢీకొంది. శంకర్‌కు గాయాలు కాగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు.
ముగ్గురికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment