స్పోర్ట్స్ వర్సిటీతో క్రీడాకారులకు మేలు
కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో నూతన క్రీడాపాలసీకి సబ్ కమిటీ వేయడంతోపాటు నూతన పాలసీకి ప్రణాళికలను రూపొందించేందుకు తొలి అడుగు వేసింది. పల్లెల నుంచి ప్రపంచస్థాయి విజేతల కోసం సీఎం కప్ అనే నినాదంతో సీఎం కప్ 2024 క్రీడాపోటీలను అట్టహాసంగా ప్రభుత్వం నిర్వహిస్తూ రెండో అడుగుకు అంకురార్పణ చేయగా.. తాజాగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి పచ్చ జెండా ఊపి ముచ్చటగా మూడో అడుగుకు బాటలు వేసి క్రీడారంగంలో జోష్‌ను నింపింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ యువ భారత్ వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయం పేరిట క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణవ్యాప్తంగా క్రీడారంగం హర్షం వ్యక్తం చేసింది. ఇక క్రీడల్లో పైచదువులకు పక్క రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా పోతుందని పలువురు క్రీడా విశ్లేషకులు సంతోషం వ్యక్తం చేశారు.
కోర్సులన్నీ ఇక్కడే..
తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఇకనుంచి క్రీడల్లో ఉన్నత చదువులు చదవాలనుకునేవారు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే విద్యనభ్యసించే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా ఇకనుంచి రాష్ట్రంలో వ్యాయామ విద్యకు సంబంధించిన కార్యకలాపాలు క్రీడా యూనివర్సిటీ పరిధిలోనే జరుగుతుండడం విశేషం. బీపీఈడీ, ఎంపీఈడీ, స్పోర్ట్స్ మెడిసన్, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ ఫిజియో, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ రిసెర్చ్, పీజీ డిప్లమాలు తదితర కోర్సులు క్రీడా యూనివర్సిటీలో చేసే అవకాశం దక్కుతుంది.
క్రీడాకారులకు చేకూరనున్న లబ్ధి
క్రీడాభివృద్ధికి బాటలు
Comments
Please login to add a commentAdd a comment