ఆరోగ్య మహిళపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద రూ.40 వేల విలువైన 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కార్యక్రమంపై ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మొహతాజ్‌ఖానా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలపై వైద్యాధికారి ఇమ్రాన్‌ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య పరీక్షలు జాగ్రత్తగా చేయాలని, ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పారు. మహిళలు రక్తహీనత బారిన పడకుండా పోషకాహారం తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎంహెచ్‌వో వెంకటరమణకు సూచించారు. ప్రతీ మంగళవారం మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు అందిస్తారని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, సూపర్‌వైజర్ ఎంకే.బేక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment